Friday, 18 December 2015

Quotes - 6



  1. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం , రైతు ఏడ్చిన రాజ్యం బాగుపదదు
  2. చాదస్తపు మొగుడు చెబితే వినదు గిల్లీతే ఏడుస్తాడు
  3. ఊరందరిది ఓ దారైతే ఉలిపికత్తది ఓ దారి అంట
  4. దన్నం పెట్టేవాడికి దూరంగా ఉన్నా పర్లేదు కానీ అన్నం పెట్టేవాడికి దగ్గరగా ఉండాలంటా
  5. ఎంత అన్నానికి అంతే ఎసరు అన్నట్లు
  6. అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు
  7. పొగ పెడితే కలుగులోంచి ఎలకలు బయటకొచ్చినట్లుగా
  8. ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య
  9. కయ్యానికి అయిన వియ్యానికి అయిన సమ ఉజ్జివులు ఉండాలంటా
  10. నడిచిందే దారి, చెప్పిందే వేదం, చేసిందే శాసనసం.
  11. తానొకటి తలచిన దైవమొకటి తలచును
  12. వినేవాడు వెర్రోడయితే, చెప్పేవోడు స్వాములారైపోతాడు
  13. రెంటికి చెడ్డ రేవడి
  14. కాల్ళో ముళ్లు గుచ్చితే ఏడవకూడదు, సంతోషించాలి. ఎందుకంటే కంట్లో గుచ్చలేదు గనుక
  15. 'హిచ్‌' అనే ఇంగ్లీష్‌ సినిమాలో ఒక డైలాగుంటుంది... 'జీవితమంటే ఎన్నిసార్లు ఊపిరి తీసుకున్నామని కాదు, ఊపిరి ఆగిపోయేలా చేసిన క్షణాలు ఎన్ని ఉన్నాయని!'
  16. ప్రకాశ్‌ రాజ్‌ కవిత కూడా వుందిగా - నువ్వు విసిరిన రాళ్లతోనే యిల్లు కట్టుకుంటా అంటూ!
  17. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో
  18. వీరిదీ ఒక బతుకేనా కుక్కల వలె, నక్కల వలె
  19. తమలపాకుతో నువ్వు అనగా లేందీ..తలుపు చెక్కతో నేను అంటే తప్పా
  20. కారణం లేని కోపం
    ఇష్టం లేని గౌరవం
    బాద్యత లేని యవ్వనం
    జ్ఞాపకం లేని వ్రుద్దప్యమ్
    అనవసరం              ---  త్రివిక్రమ్

1 comment :

  1. What exactly "ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య" means?

    ReplyDelete

Recent Posts