Showing posts with label Poems and Writings. Show all posts
Showing posts with label Poems and Writings. Show all posts

Wednesday, 14 June 2017

Om Sarve Bhavantu Sukhinah

ॐ सर्वे भवन्तु सुखिनः

सर्वे सन्तु निरामयाः ।

सर्वे भद्राणि पश्यन्तुमा 

कश्चिद्दुःखभाग्भवेत् ।

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

Om Sarve Bhavantu SukhinahSarve Santu Nir-Aamayaah |Sarve Bhadraanni PashyantuMaa Kashcid-Duhkha-Bhaag-Bhavet |Om Shaantih Shaantih Shaantih ||Meaning:1: Om, May All become Happy,2: May All be Free from Illness.3: May All See what is Auspicious,4: May no one Suffer.5: Om Peace, Peace, Peace.

Kalidasu poem



షడ్జా మడ్జ ఖరాడ్జ్య వీడ్జ్య వసుధాడ్జాలాంశ్చ విద్యాఖిలే 
జడ్యట్కిట్కిధరేధరేఖణఖణాఖడ్జూరవిద్వట్భ్రమా
లుబ్ఢ్రం లుబ్ఢ్రమలుభ్ఢ్రలుభ్ఢ్ర విపదత్ డ్గడ్గడ్గ్ర షడ్రైస్తధా
పాదౌటేటి పటేటి టేటి టురసత్ ప్రఖ్యాతి సత్యాదయా: 


Wednesday, 15 March 2017

విశ్వ విఖ్యాత నట సింహం





!!అది అసంపూర్ణ స్వతంత్ర భారతం

నివురుగప్పిన నియంత పాలనం
రాజకీయ కీలు బొమ్మలాటలు
అధికారుల తోలు బొమ్మలాటలు
వెరసీ చైతన్య రహిత జన భారతం
విశ్వ విఖ్యాత నట సింహం
జూలు విదిల్చింది 
ప్రజల పక్షాన నిలిచింది
ఏలిక పాలకులపై పంజా విసిరింది
సమూల రాజకీయ ప్రక్షాళన చేసింది
అడవి రాముడుగా తిరిగిన ఆ సింహం
బడుగు జనుల కోసం ఊరారా తిరిగింది
ప్రతి తెలుగు వాడు ఒక సింహమని
ఆత్మీయతే కాదు
ఆత్మ గౌరవం కూడా వాడికి ఉందని
సహనమే కాదు
సాహసం కూడా ఉందని
ప్రపంచానికి చాటింది
ఢిల్లీ సింహాసనం కదిలేలా ఘీంకరించండి
నేనున్నానంటూ తన జాతికి భరోసా ఇచ్చింది
ఈ నేల ఆయుస్సు ఉండేదాకా
ఈ జాతి గుండెల్లో కొలువై ఉంటుంది ఆ సింహం!!

.........జోహార్లు అర్పిస్తూ ..మీగడ త్రినాధ రావు

దేవరకొండ బాలగంగాధర తిలక్







'ఎవర్నీ నమ్మక ఈ మనుషులందరూ దొంగ వెధవలు - విష సర్పాలన్నది' తిలక్‌ సగటు పాత్రల అభిప్రాయం. 'స్వార్ధం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయం కల్గించనంతవరకే' అన్నదీ, 'సముద్రం లాంటిదే దరిద్రం కూడా అవతలి ఒడ్డు కనబడదు' అన్నదీ, దాన్ని అంటిపెట్టుకొని ఆవరించే ఆకలిని గురించి 'రోగిష్టి ఆరోగ్యాన్ని గురించీ, ఆకలితో ఉన్నవాడు రుచికరమైన పిండివంటల గురించీ ఆలోచించకుండా ఏ చట్టమూ శాసించలేదు' అన్నదీ తిలక్‌ దుర్భిణీ చూపుతో పసిగట్టిన సామాజికాంశాలు. తిలక్‌ స్త్రీ పాత్రల్లో తెలివిమీరినతనం, బతకనేర్చినతనం సమపాళ్ళల్లో ఉంటాయి. 'ఈనాటి రచయిత వస్తు స్వరూపాలకూ, సంఘర్షణలకూ, శక్తులకూ కీలకస్థానం మీద శక్తివంతమైన బాట్రీలైట్‌ ఫోకస్‌ చెయ్యాలి' అన్నది తిలక్‌ భావం.


నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.



  • నిన్నటికంటే నేడు నీ వివేకం పెంచుకోకపోతే నీ జీవితంలో మరొక రోజు వ్యర్థం అయ్యిందని తెలుసుకో 
  • కష్టంగా భావించేదాన్ని సాధించడం నేర్పు , అసాధ్యంగా భావించేదాన్ని సాధించడం ప్రతిభ 
  • విచక్షణతో మాట్లాడ్డం వాగ్దాటికన్నా మిన్న అవుతుంది 
  • ప్రతిభ లేని చదువు కన్నా చదువు లేని ప్రతిభ మిన్న 
  • ఏదయినా మంచి సాదించాలనుకున్నపుడు శ్రమించే భావం , విమర్శలను భరించే సహనం ఉండాలి 
  • మనిషి జీవితం లో పరులవలన వచ్చే సమస్యల కంటే అవగాహనారాహిత్యం వలన వచ్చే సమస్యలే ఎక్కువ 




శతకకర్త




‘‘చీమలు పెట్టిన పుట్టలు 
పాముల కిరువైనట్లు పామరుడు దగన్ 
హేమంబు గూడబెట్టిన 
భూమిశుల పాలజేరు భువిలో సుమతీ!’’  శతకకర్త

Monday, 3 October 2016

కుదిరితే పరిగెత్తు లేదా నడువు




కుదిరితే పరిగెత్తు లేదా నడువు 
అదీ కుదరకపోతే పాకుతూ పో
అంతే కానీ ఎటూ కదల కుండా ఆలా ఉండిపోకు

ఉద్యోగం రాలేదని
వ్యాపారం దెబ్బ తినిందనీ
స్నేహితుడొకడు మోసం చేసాడని
ప్రియురాలు వదిలి వెళ్లిపోయిందనీ
ఆలా ఉంది పోతే ఎలా !!

దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ కెరటాలే
ఎగిసి ఎగిసి పడుతుంటే 
తలచుకుంటే నీ తల రాత ఇంతే అన్న వాళ్ళని కూడా 
నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది !!

అలాంటిది ఇప్పుడొచ్చిన ఈ చిన్న కష్టానికే 
తలవంచేస్తే ఎలా !!

ఈ సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోడానికి వీల్లేదు 
వీచే గాలి
ఊగే చెట్టు
ప్రవహించే నది 
ఉదయించే సూర్తుడు 
అనుకున్నది సాధించాలని నీలో ఒరకలేస్తుందే ఆ నెత్తురుతో సహా
ఏదీ ... ఏదీ ఆగిపోడానికి వీల్లేదు !!

లే..
బయలుదేరు ...
నిన్ను ఎటూ కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్లను తెంచుకో!!
పడ్డ చోటునుంచే పరుగు మొదలు పెట్టు 

నువ్వు పడుకున్న పరుపు నిన్ను చీదరించుకోకముందే 
నీ బద్దకాన్ని వొదిలెయ్ !!

నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే 
సమాధానాన్ని వెతుక్కో !! 

నీ నీడ నిన్ను వదిలేయక ముందే 
వెలుగులోకి రా !!

మళ్ళీ చెప్తున్నా విను 
కన్నీళ్లు కారిస్తే కాదు 
చమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో !!!

- శ్రీ శ్రీ 

Tuesday, 23 August 2016

ఇల్లేమో దూరం






ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం
దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు
కానీ గుండె నిండా దైర్యం ఉంది !!!

రంగనాథ్ - అత్తగారి పెత్తనంబు






అత్తగారి పెత్తనంబు నెత్తిమీద రుద్దుచుండ
దద్దరిల్లి బిత్తరిల్లి చెంతనున్న కత్తి నెత్తి
నెత్తి మీద మొత్త చూసె కొత్తదైన కోడలమ్మి
- రంగనాథ్

పోతన - అడిగెదనని







అడిగెదనని కడువడి(జను
నడుగిన(దను మగుడ నడుగ(డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడ(బడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడునెడలన్

- పోతన భాగవతం

రంగనాథ్ - అదేదో ఊరినుండి






అదేదో ఊరినుండి మహా శిల్పి వచ్చాడు. మరేదో ఊరినుండి పెద్ద బండ తెచ్చాడు.
ఆరడుగులు కొలత పెట్టి బండను కండించాడు. మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేసాడు.
ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిసింది. మూడడుగుల ముక్క బండ చాకి రేవు చేరింది.
కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి. కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి.
గొంతెమ్మ గొంతు కోర్కెలన్నీ తీర్థం తో తడిచాయి. మురికి మరక బట్టలన్నీ నీళ్ళల్లో మురిగాయి.
అర్ధం గాని స్టోస్త్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు. చాకలి నోటి వెంట ఐస్ .. ఐస్ .. శబ్దాలు.
శఠగోపం పవిత్రంగా ప్రతీ తలను తాకుతోంది. పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతోంది.
కడకు, గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్లాయి. రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్లాయి.
గుడిలోని దేవుడా రేవు లోని బండా !! ఎవరు దేవుడు ఎవరు బండ !!
- రంగనాథ్

పోతన - అమ్మల గన్నయమ్మ

 


అమ్మల గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ కడుపాఱడి  బుచ్చిన యమ్మ, దన్నులో
నమ్మినవేల్పుటమ్మల మనమ్ములనుండెడియమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
 
- పోతన భాగవతం

సుమతీ - వినదగునెవ్వరు చెప్పిన



వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపఁదగున్
కణికెల్లా నిజాము తెలిసిన
మనుజుడెపో, నీతిపరుడు మహిలో సుమతీ!
 
 

వేమన - చెప్పులోన రాయి

 
చెప్పులోన రాయి చెవిలోన జోరీగ
    కంటిలొన నలుసు కాలి ముల్లు
    ఇంటిలోన పోరు ఇంతింత గాదయ
    విశ్వధాభిరామ, వినుర వేమ:

వేమన - తప్పులెన్నువారు

 
తప్పులెన్నువారు తండోపతండంబు
    లుర్వి జనులకెల్ల నుండు తప్పు
    తప్పు లెన్నువారు తమతప్పు లెరుగరు
    విశ్వధాభిరామ, వినుర వేమ: 

వేమన - మేడి పండు చూడ

 
మేడి పండు చూడ మేలిమైయుండు
    పొట్ట విప్పి చూడ పురుగులుండు
 పిరికి వాని మదిని బింకమీలాగురా
 విశ్వధాభిరామ, వినుర వేమ:
 


meaning : A coward appears brave outside, but in reality he is not.

వేమన - ఇనుము విరిగెనేని

 
 
   ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
    కాచి యతకవచ్చు క్రమము గాను
    మనసు విరిగెనేని మరి చేర్చరాదయ
    విశ్వధాభిరామ, వినుర వేమ:

వేమన - ఎలుక తోలు తెచ్చి

 
 
   ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా
   నలుపు నలుపే గాని తెలుపు కాదు
   కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా
   విశ్వధాభిరామ, వినుర వేమ:

వేమన - ఆత్మశుద్ధి లేని

 
ఆత్మశుద్ధి లేని అచారమది ఏల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ది లేని శివ పూజలేలర
విశ్వధాభిరామ, వినుర వేమ:

Monday, 22 August 2016

శ్రీ శ్రీ - వేల కాని వేళల్లో

 
 
 
వేల కాని వేళల్లో
లేనిపోని వంఛలతో
కాని కాని ధారులలో
కానరాని కాంక్షలతో
దేనికోసం పధే పధే వెదుకులాడుతావ్

వేమన - చిక్కియున్నవేళ



చిక్కియున్నవేళ సింహంబు నైనను
బక్క కుక్క కరచి బాధ చేయు
బలిమి లేని వేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమః

Recent Posts