Friday, 11 November 2016
ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు
ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు,
నమస్కారం.
నాపేరు ప్రసాద్. హైదరాబాద్ లోని బాలానగర్ లో చిన్న ఇండస్ట్రీ నడుపుతాను. నెలకి 2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అంటే, ఏడాదికి 24 లక్షలు. నిజాయితీగా అయితే ఏడాదికి కనీసం 3 లక్షలు (మినహాయింపులు అన్నీ పోను) ఆదాయపు పన్ను కట్టాలి. అయితే నేను జస్ట్ 30 వేలు మాత్రమే పన్ను కడతాను. ఎందుకంటే..?
నేను ఒక మామూలు మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టా. కష్టపడి చదువుకుని కొన్నాళ్ళు ఉద్యోగం చేసి, పైసా పైసా కూడబెట్టి ఇప్పుడు సొంత ఇండస్ట్రీ పెట్టుకునే దశకి చేరుకున్నాను. నా సంపాదన రెండు లక్షల్లో, ఒక లక్ష నా కుటుంబ అవసరాలకి సరిపోతుంది. మిగతా లక్ష భూములు, బంగారం లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఖర్చు పెట్టె లక్ష రూపాయల్లో దాదాపు 30 వేలు పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం రాబట్టు కుంటోంది. కిరాణా సరకుల దగ్గర నుంచి టీవీ, మొబైల్ దాకా ఏది కొన్నా 20 నుంచి 30 శాతం పన్ను. ఇక ఫ్రెండ్స్ తో మందుపార్టీ చేసుకుంటే, 3000 ఖర్చు అయితే, దాదాపు 60% ప్రభుత్వానికి పన్ను. కారుకి పెట్రోల్ కొట్టిస్తే లీటరుకి రు.30 పన్ను. కారు కొంటే అన్ని టాక్సులు కలిపి ప్రభుత్వానికి లక్షన్నర చెల్లించా. ఇంటి స్థలం కొంటె లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ కోసం కట్టా. ప్రభుత్వం కనీసం మట్టిరోడ్డు కూడా వేయని మా కాలనీలో స్థలం కొన్నందుకు ప్రభుత్వం డెవలప్ మెంట్ చార్జీల పేరుతో 50 వేలు వసూలు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో చూసాక, కార్పోరేట్ ఆస్పత్రులు ఎంత దోపిడీ చేస్తున్నాయో చూసాక, తప్పక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే, సిగ్గు కూడా లేకుండా ప్రభుత్వం దాని మీద సర్వీస్ టాక్స్ వేసింది. దారిదోపిడి దొంగలు దోచుకున్నట్లు, ప్రతిదాని మీద ఆఖరికి స్మశానంలో శవాదహనం మీద కూడా పన్నులేస్తున్న ప్రభుత్వం మాకు తిరిగి ఏమిస్తోంది?
గవర్నమెంట్ స్కూల్స్ లో మా పిల్లల్ని చేర్పిస్తే చదువు వస్తుందనే నమ్మకం ఉందా? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యంతో తిరిగొస్తామనే నమ్మకం ఉందా? దేశ రక్షణ, రోడ్లు వేయడం తప్ప, చేస్తున్న అభివృద్ధి పనులేమిటో మాకు అర్థం కావడం లేదు. కారు కొంటె రోడ్ టాక్స్, రోడ్డెక్కితే టోల్ టాక్స్..తోలు తీసేస్తున్నారు కదా సర్. ఇక మా పన్నుల డబ్బు ఏమైపోతోంది? మా ఇండస్ట్రీలో పనిచేసే వారికి జీతం పెంచాలి అంటే, వారు ఎంత పని చేస్తారు, ఎలా పనిచేస్తారు అని ప్రతి ఏడూ చూసి ఇంక్రిమెంట్ ఇస్తాం. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఉద్యోగి పనిచేసినా చేయకపోయినా, అధ్వాన్నంగా చేసినా, అందరికీ ఒకే జీతం, ఒకే ఇంక్రిమెంట్.. మా సొమ్మంటే అంత లోకువా? పైగా మా పన్నుల డబ్బు తో జీతాలు తీసుకుంటూ, మా పనులు చేయాలంటే, ఫోజులు కోడతారు. 10 గంటలకి ఆఫీసు అంటే 11 గంటలకి వస్తారు. లంచం లేకుండా ఒక్క పని కూడా చేయరు. మరి ఎందుకు సార్, మేము ప్రభుత్వాలకి పన్నులు కట్టాలి. ఇండస్ట్రీ నడవాలి అంటే, కరెంట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి లంచాలు ఇవ్వాలి. అందరికీ కలిపి నెలకి సుమారు 10 వేలు నేను లంచం ఇవ్వాల్సి వస్తోంది. ఆ లంచాలన్నీ వైట్ లో చూపించడం ఎలా సార్? అందుకే సార్, మాకు ప్రభుత్వాలకి పన్ను కట్టాలంటే కడుపు మండిపోద్ది. అలాగని నేను సామాజిక బాధ్యత లేనివాణ్ణి కాదు సర్, మీరు సైనిక నిధికి విరాళం ఇవ్వమంటే 10 వేలు ఇచ్చా. మా దగ్గరలో ఉన్న అనాధశ్రమానికి ఏడాదికి 20 వేలు ఇస్తా. మా ఊర్లో స్కూల్ బాగుచేస్తామంటే మా నాన్న పేరుమీద లక్ష డొనేషన్ ఇచ్చా. కానీ ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే మాత్రం నాకు మనసొప్పదు సర్.ఓకే.. ఇదంతా గతం. ఇప్పుడు అంతా వైట్ మనీ లోనే వ్యవహారాలు చేద్దాం. మీరు డిసైడ్ చేసారు కాబట్టి, నా దగ్గర ఉన్న 10 లక్షల బ్లాక్ మనీ కి 30% అంటే 3 లక్షలు కట్టి, మొత్తం వైట్ లోకి మార్చుకుంటా. కానీ, రేపటి నుంచి నేను నెలకి 10 వేలు లంచాలు ఇవ్వకుండా పనులు అవుతాయనే గ్యారంటీ ఇస్తారా? లేదా లంచాల్ని చెక్ రూపంలో తీసుకొమ్మని ఉద్యోగులకి పర్మిషన్ ఇస్తారా? ఇక నాయకుల సంగతి చెప్పలేదు కదా..మా గల్లీ లీడర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దాకా అందరి ఎలెక్షన్లకి, అన్ని పార్టీల వాళ్లకి విరాళాలు ఇవ్వాలి. లేకపోతె ఇబ్బంది పెడతారు. వీళ్ళని కూడా విరాళాలు చెక్కుల రూపంలో తీసుకొమ్మని చట్టం తెస్తారా? పార్టీల డబ్బుల లెక్కల్ని రహస్యం లేకుండా ఓపెన్ గా చెబుతారా? ఇప్పటికే బోలెడు పన్నులు కడుతున్న మాకు, ప్రభుత్వం ఏం సేవలు ఇస్తుందో చెప్పండి. నాయకుల జల్సాల కోసం, ఉద్యోగుల జీతాలకోసం అయితే మేము పన్నులు కట్టం సర్. వీలయినంత ఎగ్గొడతాం. పదేళ్ళకి మళ్ళీ దేశంలో బ్లాక్ మనీ పెరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ నోట్ల మార్పిడి తెస్తారా? ఇందుకు కాదు సర్, మిమ్మల్ని ఎన్నుకుంది. మీ నిర్ణయం వల్ల రెండు రోజులుగా చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతున్న మా వర్కర్స్ కూడా, మీ మీద నమ్మకంతో ఈ ఇబ్బందిని సంతోషంగా భరిస్తున్నారు సార్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ముందు మేము కడుతున్న పన్నులకి న్యాయం చేయండి. అప్పుడు మేము కూడా న్యాయంగా పన్నులు కడతాం. రెండు చేతులు కలిస్తేనే సర్ చప్పట్లు, మా చెయ్యి రెడీ.. మీ చేత కోసం ఎదురు చూస్తుంటాం.
ఇట్లు,
మీ అభిమాని, ఓటరు
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent Posts
-
Number of letter in Malayalam - 51 Number of letter in Tamil - 36 Number of letter in Telugu - 56 How can one differentiate between ...
-
HOW THE CURRENCY VALUE CHANGES? Please go through the below simple Economics, which will give a good idea on why Taxes are more important...
-
*Journey of Indian Stock Market* : *1979* - Sensex = *100*, *1981* - Sensex = *173*, *1983* - Indian Cricket Team winning World Cup. Sens...
-
చిక్కియున్నవేళ సింహంబు నైనను బక్క కుక్క కరచి బాధ చేయు బలిమి లేని వేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమః
-
*ఇవి ఇండియాకే సాధ్యం.* 1.కూతురు చదువుఖర్చు కంటే పెళ్లిఖర్చు ఎక్కువ. 2. పోలీసుని చూస్తే భద్రత కంటే భయం ఎక్కువ 3. సిగ్గు చాలా ఎక్కువ అయిన...
No comments :
Post a Comment