'ఎవర్నీ నమ్మక ఈ మనుషులందరూ దొంగ వెధవలు - విష సర్పాలన్నది' తిలక్ సగటు పాత్రల అభిప్రాయం. 'స్వార్ధం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయం కల్గించనంతవరకే' అన్నదీ, 'సముద్రం లాంటిదే దరిద్రం కూడా అవతలి ఒడ్డు కనబడదు' అన్నదీ, దాన్ని అంటిపెట్టుకొని ఆవరించే ఆకలిని గురించి 'రోగిష్టి ఆరోగ్యాన్ని గురించీ, ఆకలితో ఉన్నవాడు రుచికరమైన పిండివంటల గురించీ ఆలోచించకుండా ఏ చట్టమూ శాసించలేదు' అన్నదీ తిలక్ దుర్భిణీ చూపుతో పసిగట్టిన సామాజికాంశాలు. తిలక్ స్త్రీ పాత్రల్లో తెలివిమీరినతనం, బతకనేర్చినతనం సమపాళ్ళల్లో ఉంటాయి. 'ఈనాటి రచయిత వస్తు స్వరూపాలకూ, సంఘర్షణలకూ, శక్తులకూ కీలకస్థానం మీద శక్తివంతమైన బాట్రీలైట్ ఫోకస్ చెయ్యాలి' అన్నది తిలక్ భావం.
నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.
అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.
- నిన్నటికంటే నేడు నీ వివేకం పెంచుకోకపోతే నీ జీవితంలో మరొక రోజు వ్యర్థం అయ్యిందని తెలుసుకో
- కష్టంగా భావించేదాన్ని సాధించడం నేర్పు , అసాధ్యంగా భావించేదాన్ని సాధించడం ప్రతిభ
- విచక్షణతో మాట్లాడ్డం వాగ్దాటికన్నా మిన్న అవుతుంది
- ప్రతిభ లేని చదువు కన్నా చదువు లేని ప్రతిభ మిన్న
- ఏదయినా మంచి సాదించాలనుకున్నపుడు శ్రమించే భావం , విమర్శలను భరించే సహనం ఉండాలి
- మనిషి జీవితం లో పరులవలన వచ్చే సమస్యల కంటే అవగాహనారాహిత్యం వలన వచ్చే సమస్యలే ఎక్కువ
No comments :
Post a Comment