Wednesday, 15 March 2017
విశ్వ విఖ్యాత నట సింహం
!!అది అసంపూర్ణ స్వతంత్ర భారతం
నివురుగప్పిన నియంత పాలనం
రాజకీయ కీలు బొమ్మలాటలు
అధికారుల తోలు బొమ్మలాటలు
వెరసీ చైతన్య రహిత జన భారతం
విశ్వ విఖ్యాత నట సింహం
జూలు విదిల్చింది
ప్రజల పక్షాన నిలిచింది
ఏలిక పాలకులపై పంజా విసిరింది
సమూల రాజకీయ ప్రక్షాళన చేసింది
అడవి రాముడుగా తిరిగిన ఆ సింహం
బడుగు జనుల కోసం ఊరారా తిరిగింది
ప్రతి తెలుగు వాడు ఒక సింహమని
ఆత్మీయతే కాదు
ఆత్మ గౌరవం కూడా వాడికి ఉందని
సహనమే కాదు
సాహసం కూడా ఉందని
ప్రపంచానికి చాటింది
ఢిల్లీ సింహాసనం కదిలేలా ఘీంకరించండి
నేనున్నానంటూ తన జాతికి భరోసా ఇచ్చింది
ఈ నేల ఆయుస్సు ఉండేదాకా
ఈ జాతి గుండెల్లో కొలువై ఉంటుంది ఆ సింహం!!
.........జోహార్లు అర్పిస్తూ ..మీగడ త్రినాధ రావు
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent Posts
-
Number of letter in Malayalam - 51 Number of letter in Tamil - 36 Number of letter in Telugu - 56 How can one differentiate between ...
-
bifurcation - separation loathe chronograph - generally you see in watches Conjunctivitis - eye infection yogurt - curd ...
-
this has to be turned over to business today. Stephanie - I am leaving for doc appt – can you get a quick call together with this group...

No comments :
Post a Comment