Tuesday, 7 June 2016

Quotes - 8

 
 
 


  1. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తీసుకొచ్చినట్టు తయారయ్యింది పరిస్థితి
  2. గొర్రెల మందపై తోడేళ్లను వదిలినట్టు రైతులపై అధికారులను వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశాడు
  3. బోడిగుండుకు.. మోకాలికి ముడి పెట్టినట్లు
  4. ఏడ్చినమ్మకు మొగడుడొస్తే... నవ్వినమ్మకు రాదా
  5. అగ్రెసివ్‌గా వుంటే సరిపోదు, అప్రమత్తంగా కూడా వుండాలి
  6. మూడేళ్ళ పిల్ల ముంతకు ఆసరా
  7. గతి లేక గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు
  8. గతి లేని సంసారానికి మతి లేని మొగుడు అన్నట్టు
  9. గుడ్డెద్దు చేలో పడట్టుగా
  10. చీమల పుట్టలో పాములు
  11. క్షేత్రస్థాయిలో పునాది వేసుకుని అందరిని ఏకం చేసుకుని ఒక్కసారిగా దండయాత్ర మొదలుపెట్టాడు కోదండరాం
  12. మేధావి మౌనం దేనికి దారితీస్తుందో అన్న కోణంలో కేసీఆర్ ఆలోచించలేదు
  13. అడుసు తొక్కేయడం ఎందుకో? కాళ్లు కడుక్కోవడం ఎందుకో?
  14. తెలివైన వాడు ఎపుడూ ఎక్కడ దొరికితే అక్కడ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు
  15. ప్రథమ కబళే మక్షికాపాతః
  16. త్రివిక్రమ్ అంతగా నేల విడిచి సాము చేయడు
  17. అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు
  18. మాకు ఇది చేస్తే, మీకు ఇది చేస్తాం - క్విడ్ ప్రో కో - ఇస్తినమ్మ వాయినం.. పుచ్చుకుంటి వాయినం
  19. తెలంగాణ రాష్ట్రం కోసం గొంగలి పురుగునైనా ముద్దాడతానని కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన రోజుల్లో అనేవారు
  20. అజయ్‌ 'మోడరన్‌ కట్టప్ప' తరహా నమ్మిన బంటు పాత్రలో బాగున్నాడు.

No comments :

Post a Comment

Recent Posts