Tuesday, 23 August 2016

గున్న మామిడీ కొమ్మమీద

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గున్న మామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామ చిలకుంది , ఒక గూటిలోనా కోయిలుందీ
గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

ఆ ఆ ఆ
చిలకేమో పచ్చనిది.. కొయిలోమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది

ఆ ఆ ఆ
చిలకేమో పచ్చనిది.. కొయిలోమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది

పొద్దున్న చిలకను చూడందే , ముద్దుగా ముచ్చటలాడందే
పొద్దున్న చిల్లకను చూడందే, ముద్దు ముద్దుగా ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయలా

గున్న మామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామ చిలకుంది , ఒక గూటిలోనా కోయిలుంది

గున్న మామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

ఆ ఆ ఆ
ఒక పలుకే పలుకుతాయ్ , ఒక జట్టుగా తిరుగుతాయ్
ఎండిన వానైనా ఏకంగా ఎగురుతాయ్

ఆ ఆ ఆ
ఒక పలుకే పలుకుతాయ్ , ఒక జట్టుగా తిరుగుతాయ్

ఎండిన వానైనా ఏకంగా ఎగురుతాయ్
రంగు రూపు వేరైనా , జాతీ రీతీ ఏదయినా

రంగు రూపు వేరైనా , తమ జాతీ రీతీ ఏదయినా
చిలకా కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని చలిమి

హొయ్
గున్న మామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామ చిలకుంది , ఒక గూటిలోనా కోయిలుంది

గున్న మామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గున్న మామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గున్న మామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

*********************************
చిత్రం - బాల మిత్రుల కథ - 1972
సంగీతం - సత్యం
గానం - జానకి
రచన - సినారే

No comments :

Post a Comment

Recent Posts