పదిమాసాలు మోసావు పిల్లలను
బ్రతుకంతా మోసావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను
మోసేవాళ్ళు లేక వెళుతున్నావు
ఈ జీవన తరంగాలలో
ఆ దేవుని చదరంగంలో
ఎవరికీ ఎవరు సొంతము
ఎంత వరకు ఈ బంధము
కడుపు చించుకు పుట్టిందొకరు
కాటికి నిన్ను మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు
ఆపై నీతో వచ్చేదెవరు (2)
ఈ జీవన తరంగాలతో
ఆ దేవుని చదరంగంలో
ఎవరికీ ఎవరు సొంతము
ఎంత వరకు ఈ బంధము
మమతే మనిషికి బందీఖానా
భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటబడి
ఋణం తీర్చుకోమంటుంది
తెలియని పాశం వెంటబడి
ఋణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది
ఈ జీవన తరంగాలతో
ఆ దేవుని చదరంగంలో
ఎవరికీ ఎవరు సొంతము
ఎంత వరకు ఈ బంధము
తాళి కట్టిన మగడు లేడని
తరలించుకు పోయే మృత్యువాగాదు
ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు
ఆ కన్నీళ్లకు చితి మంటలరావు
ఈ మంటలు ఆ గుండెను అంతక మానవు
ఈ జీవన తరంగాలతో
ఆ దేవుని చదరంగంలో
ఎవరికీ ఎవరు సొంతము
ఎంత వరకు ఈ బంధము
==========================
చిత్రం : జీవన తరంగాలు - ౧౯౭౩
రచన : ఆత్రేయ
గానం : గంటసాల
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent Posts
-
Number of letter in Malayalam - 51 Number of letter in Tamil - 36 Number of letter in Telugu - 56 How can one differentiate between ...
-
bifurcation - separation loathe chronograph - generally you see in watches Conjunctivitis - eye infection yogurt - curd ...
No comments :
Post a Comment