Sunday, 21 August 2016

ఇది మల్లెల వేళయని

ఇది మల్లెల వేళయని , ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఓక కోయిల ముందే కూసింది విందులు చేసింది

కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచుననై
ఇక సిరే ఎండలు కాల్చునని మరి ముసిరే వానలు ముంచుననై
ఎరుగని కోయిల ఎగిరిందీ , ఎరుగని కోయిల ఎగిరింది
చిరిగిన రెక్కల ఒరిగింది , నెలకు ఒరిగింది

ఇది మల్లెల వేళయని , ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఓక కోయిల ముందే కూసింది విందులు చేసింది

మరిచిపోయేది మానవ హృదయం , కరుణ కరిగేది చల్లని దైవం
మరిచిపోయేది మానవ హృదయం , కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చువాడనివసంతమాసం వసివాడని కుసుమావిలాసం

ఇది మల్లెల వేళయని , ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఓక కోయిల ముందే కూసింది విందులు చేసింది

ద్వారానికితారామణిహారం హారతి వెన్నెల కర్పూరం
ద్వారానికితారామణిహారం హారతి వెన్నెల కర్పూరం

మోసం ద్వేషం లేని సీమలో
మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీమందరం

ఇది మల్లెల వేళయని , ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఓక కోయిల ముందే కూసింది విందులు చేసింది

*********************************************

చిత్రం - సుఖ దుక్కాలు - 1968
సంగీతం - SP KODANDAPANI
రచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : P SUSHEELA

No comments :

Post a Comment

Recent Posts