Thursday, 13 April 2017

కట్టెదుర వైకుంఠము



కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండ కాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్విదపసులే తరువులై నిలచిన కొండ పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దదివో శ్రీవేంకటపు గొండ

No comments :

Post a Comment

Recent Posts